హైకోర్టు కొత్త భవనాలకు 80 ఎకరాలు ఇవ్వండి

హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): హైకోర్టు నూతన భవన సముదాయాల కోసం 80 ఎకరాలు కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ ప్రభుత్వాన్ని కోరారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్రశర్మను, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డిని గురువారం రాష్ట్ర బార్‌కౌన్సిల్ సన్మానించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ శర్మ మాట్లాడుతూ, భూమి కేటాయింపుపై ఏజీ కృషి చేయాలని కోరారు. బార్ కౌన్సిల్‌కు ప్రత్యేక భవన సముదాయం నిర్మాణానికి భూమి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని చీఫ్ జస్టిస్ చెప్పారు. కొవిడ్ వైరస్ వ్యాప్తి సమయంలో కష్టంలో ఉన్న న్యాయవాదులను ఆదుకునేందుకు బార్ కౌన్సిల్ చేసిన కృషిని న్యాయమూర్తులు ప్రసంసించారు. ఈ కార్యక్రమంలో ఏజీ బీఎస్ ప్రసాద్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్, బార్ కౌన్సిల్ వైస్‌చైర్మన్ సునీల్‌గౌడ్, తెలంగాణకు చెందిన జాతీయ బార్ కౌన్సిల్ సభ్యుడు పీ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

