వెంకటాపురం(నూగూరు), అక్టోబర్ 5 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం (నూగూరు) లోని చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని సోమవా రం పాము కాటుకు గురైంది. 7వ తరగతి చదువుతున్న అవిశా బాత్రూమ్కు వెళ్తుండగా పాముకాటుకు గురైంది.
ఉపాధ్యాయులు వెంటనే విద్యార్థినిని మండల కేంద్రంలోని వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ములుగు వైద్యశాలకు రెఫర్ చేశారు.