IND vs ENG : ఇంగ్లండ్ పర్యటన తొలి వన్డేలోనే అర్ధ శతకం బాదేసిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో దంచికొట్టిన గిల్ 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి శతకం భాగస్వామ్యం నెలకొల్పిన గిల్ కుడి తొడ కండరాల నొప్పితో విలవిలలాడాడు. ఫీజియో వచ్చి పరీక్షించినా ఉపశమనం లేకపోవడంతో.. రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు టీమిండియా కెప్టెన్.
ఎడ్డ్‌బాస్టన్ వన్డేలో ఇంగ్లండ్ నిర్దేశించిన 259 పరగుల ఛేదనలో రోహిత్ శర్మ(11), విరాట్ కోహ్లీ(5)లు విఫలమైనా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దంచేశాడు. అనూహ్యంగా రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అర్ధ శతకంతో జట్టును గెలుపు దిశగా నడిపించిన గిల్.. 80 పరుగుల వద్ద.. కుడి తొడ కండరాలు పట్టేయడంతో మైదానం వీడాడు.
Shubman Gill retires hurt on 80 🤕 pic.twitter.com/3B5cuPTRor
— Cricinfo (@cricinfo) July 14, 2026
ఆ తర్వాతి బ్యాటర్‌గా వాషింగ్టన్ సుందర్ (12 నాటౌట్) క్రీజులోకి వచ్చాడు. కానీ, హ్యారీ బ్రూక్ మెరుపు త్రోకు క్రీజులో కుదరుకున్న శ్రేయాస్ అయ్యర్(35) రనౌటయ్యాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే జోష్ టంగ్ బౌలింగ్‌లో బంతిని వికెట్ల మీదకు ఆడుకొని కేఎల్ రాహుల్(1) బౌల్డయ్యాడు. అంతే.. నాలుగో వికెట్ పడింది. ప్రస్తుతం సుందర్ జతగా అక్షర్ పటేల్(3 నాటౌట్) ఆడుతున్నాడు. ఓవర్లకు స్కోర్. 168-4. ఇంకా విజయానికి 92 పరుగులు కావాలి.