Giant Jackfruit : సాధారణంగా మిగతా పండ్ల (Fruits) తో పోలిస్తే పనసపండ్లు (Jack fruits) లావుగా, బరువుగా ఉంటాయి. ఈ పండ్లు రెండుమూడు కిలోల నుంచి ఐదారు కిలోల వరకు బరువుంటాయి. కొన్ని పండ్లు ఏకంగా 10 నుంచి 20 కిలోల వరకు బరువు తూగుతాయి. కానీ తాజాగా ఓ పనసపండు 72 కిలోల బరువుతో వార్తల్లో నిలిచింది. కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని హసన్ జిల్లా (Hassan district) సక్లేష్పూర్లో జరిగిన పనస, మామిడి మేళాలో ఈ పనసపండును ప్రదర్శించారు.
హెబ్బనహళ్లికి చెందిన ప్రతాప్ కుమార్ అనే రైతు ఈ పనసపండును పండించారు. గతంలో ఎన్నడూ ఇంత భారీ పనసపండు పండినట్టు చరిత్రలో లేకపోవడంతో.. రైతు ప్రతాప్ ఈ పండును ప్రపంచ రికార్డు కోసం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గిన్నిస్ బుక్ వివరాల ప్రకారం.. 2024లో అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ రైతు పండించిన 54.43 కిలోల పనసే ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత బరువైనదిగా గుర్తింపు కలిగి ఉంది. తాను పెంచుతున్న మక్కె రకం పనస చెట్టుకు ఏటా భారీ పనసకాయలు కాస్తున్నాయని రైతు ప్రతాప్ తెలిపారు.