Bhagyashri Borse | రామ్‌తో ప్రేమ వార్తలకు భాగ్యశ్రీ బోర్సే ఫుల్ క్లారిటీ .. వైరల్ అవుతున్న కామెంట్స్!
Bhagyashri Borse | 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తొలి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, తన అందం, నటనతో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించిన ఈ భామ తాజాగా 'లెనిన్' సినిమాతో కెరీర్లో తొలి విజయాన్ని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Bhagyashri Borse | ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తొలి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, తన అందం, నటనతో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించిన ఈ భామ తాజాగా ‘లెనిన్’ సినిమాతో కెరీర్లో తొలి విజయాన్ని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఆమె సినిమా కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొంతకాలంగా హీరో రామ్ పోతినేనితో భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారనే ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇద్దరూ కలిసి నటిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా ప్రారంభమైనప్పటి నుంచే ఈ రూమర్స్ ఊపందుకున్నాయి.
అయితే ఈ వార్తలపై రామ్ గతంలో స్పందించి ఖండించినప్పటికీ, భాగ్యశ్రీ మాత్రం ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. దీంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఇటీవల ‘లెనిన్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా భాగ్యశ్రీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. “హైదరాబాద్ నా రెండో ఇల్లు” అని ఆమె చెప్పడంతో, సోషల్ మీడియాలో మళ్లీ రామ్‌తో రిలేషన్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. అభిమానులు కూడా వీరిద్దరూ నిజంగానే డేటింగ్లో ఉన్నారేమో అంటూ కామెంట్లు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీరు కలిసి పనిచేసిన హీరోల్లో ఎవరితో ఫ్రెండ్షిప్, ఎవరితో డేటింగ్, ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అని అడగగా, అఖిల్ అక్కినేని తనకు మంచి స్నేహితుడని చెప్పిన ఆమె, డేటింగ్ మరియు పెళ్లి విషయానికి వచ్చేసరికి ఒకే హీరో పేరును సూచిస్తూ నవ్వింది. నేను కలిసి నటించిన హీరోల్లో పెళ్లి కాని వ్యక్తి ఒక్కరే ఉన్నారు అని చెప్పడంతో, ఆమె ఉద్దేశం రామ్ పోతినేనినేనని నెటిజన్లు భావిస్తున్నారు.
ఈ వ్యాఖ్యలకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు సరదాగా భాగ్యశ్రీ పోతినేని అంటూ పోస్టులు చేస్తుండగా, మరికొందరు ఇది కేవలం ఫన్ సెగ్మెంట్ మాత్రమేనని అంటున్నారు. అయితే ఈ కామెంట్స్‌ని తమ ప్రేమ వ్యవహారానికి సంబంధించి అఫీషియల్ భావించే పరిస్థితి లేదు. రామ్ లేదా భాగ్యశ్రీ నుంచి ఈ అంశంపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు.ప్రస్తుతం భాగ్యశ్రీ కెరీర్ పరంగా కూడా బిజీగా ఉంది. వరుస సినిమాలతో అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న ఈ నటి, ‘లెనిన్’ విజయంతో మరిన్ని ప్రాజెక్టులు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Akhil
- Bhagyashri Borse
- Lenin
- love
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

