Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
Pakistan | పాకిస్థాన్ (Pakistan) లో రాజకీయ సంక్షోభం (Political Crisis) తీవ్రరూపం దాలుస్తున్నది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa) లో అత్యవసర పరిస్థితి విధించడంతో మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు గవర్నర్ హౌస్ (Governor House) కు నిప్పుపెట్టారు.
Pakistan : పాకిస్థాన్ (Pakistan) లో రాజకీయ సంక్షోభం (Political Crisis) తీవ్రరూపం దాలుస్తున్నది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa) లో అత్యవసర పరిస్థితి విధించడంతో మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు గవర్నర్ హౌస్ (Governor House) కు నిప్పుపెట్టారు. గవర్నర్ ఇల్లు మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు సోషల్‌మీడియా (Social Media) లో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు పలు నగరాల్లో పోలీసులు కాల్పులు జరుపుతున్నట్లుగా ఉన్న వీడియోలు కలకలం రేపుతున్నాయి.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ నేతృత్వంలోని ప్రావిన్షియల్ ప్రభుత్వాన్ని పక్కనపెడుతూ కేంద్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. దాంతో ఆదివారం పెద్దసంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఇస్లామాబాద్ వరకు పీటీఐ తలపెట్టిన ర్యాలీకి కూడా భద్రతాచర్యలతో ఆటంకం ఏర్పడింది.
అయితే గవర్నర్ హౌస్‌కు మంటలు ఎలా అంటుకున్నాయి..? ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది..? ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా..? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రభుత్వ అణచివేత చర్యల్లో భాగంగా స్వాబీలో 59 మంది పీటీఐ కార్యకర్తలను, ఖైబర్ జిల్లాలో మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది, పీటీఐ ప్రావిన్షియల్ అధ్యక్షుడు జునైద్ అక్బర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి.
ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రావిన్స్‌లోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులపై భద్రతా బలగాలను మోహరించారు. స్వాబీలో మొబైల్ ఫోన్, పీటీసీఎల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రావిన్షియల్ పాలనపై పట్టు సాధించేందుకు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గవర్నర్ పాలన విధించడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని అభివర్ణించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

