
సిటీబ్యూరో, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ రెండో సమావేశం బుధవారం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. మల్టీ పర్సస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయాలు తీసుకున్నారు. హౌసింగ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ద్వారా న్యాక్ ఇంజనీర్ల నియామకంలో రిజర్వేషన్ ప్రకారం నియమిస్తున్నామని, పాత బస్తీ యువతకు ఉపాధి కల్పించేందుకు అవకాశాలు మెరుగుపరచాలని పాత బస్తీలో కూడా న్యాక్ ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. వీరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏంఐఎం సభ్యులు కోరగా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన న్యాక్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఇందుకు రిజర్వేషన్ ప్రకారం మెరిట్ గల వారిని ఎంపిక చేసి పంపిస్తారని, సుమారు 200 ఇంజనీరింగ్ పర్మినెంట్ పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఔట్ సోర్సింగ్ నియామకం అవసరం ఏర్పడినట్లు ఇంజనీర్ ఇన్ చీఫ్ జియాఉద్దీన్ ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. ఖాళీగా ఉన్న స్వీపర్ పోస్టులను ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నియమించాలని మేయర్ అధికారులను కోరారు. శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ స్వీపర్ హాజరు పరిస్థితి సరిగా నమోదు చేయడం లేదని ఎప్పటి కప్పుడు కార్పొరేటర్లు పరిశీలించాలని మేయర్ కోరారు.
సమావేశంలో కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ 15 మంది సభ్యులకు గాను 12 మంది సభ్యులు హాజరయ్యారు. మల్లాపూర్ కార్పొరేటర్ పి.దేవేందర్ రెడ్డి, మహమ్మద్ అబ్దుల్ సలాం సాహిద్ చావని, మహపార కుర్మగూడ, మిర్జా ముస్తఫా బేగ్ రియాసత్ నగర్, పర్వీన్ సుల్తాన ఘన్సీ బజార్, మందగిరి స్వామి కార్వాన్, బాత జబీన్ విజయనగర్, ఇ.విజయ్ కుమార్ గౌడ్ అంబర్ పేట్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ షేక్ పేట్, సిఎన్.రెడ్డి రహమత్ నగర్, వై.ప్రేమ్ కుమార్ ఈస్ట్ ఆనంద్ బాగ్, సామల హేమ సీతాఫల్ మండి పాల్గొన్నారు.