
సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అందుకు అనుగుణంగా చెత్త సేకరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతూ వస్తున్నది. ఇంటింటి చెత్త సేకరణకు ప్రస్తుతం ఉన్న 3,150 స్వచ్ఛ ఆటో టిప్పర్లకు ఆదనంగా మరో 1350 స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే సనత్‌నగర్‌లోని జీహెచ్ఎంసీ వెల్ఫేర్ గ్రౌండ్లో 250 స్వచ్ఛ ఆటోలను సోమవారం ఉదయం 10 గంటలకు మంత్రి కేటీఆర్, మేయర్ విజయలక్ష్మి, నగర మంత్రులతో కలిసి ప్రారంభించనున్నారు.