కేంద్రంపై పోరుకు ప్రజా ఉద్యమాలు

ఫిబ్రవరిలో సార్వత్రిక సమ్మె : ఏఐటీయూసీ
హిమాయత్‌నగర్, జనవరి 8: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు బలమైన ప్రజా ఉద్యమాలు కొనసాగించాలని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్కౌర్, జాతీయ కార్యదర్శి డాక్టర్ బీవీ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రైవేటు, కార్పొరేట్‌తోపాటు స్వదేశీ సంస్థలకు తొత్తుగామారి దేశ ఆర్థికపరిస్థితిని చిన్నాభిన్నం చేస్తున్నదని విమర్శించారు. దేశంలో నిరుద్యోగ సమస్య జటిలమవుతున్నదని, పట్టణప్రాంత ప్రజల పరిస్థితులు దుర్భరంగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యోగాల కల్పనలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, ప్రైవేటీకరణను వేగవంతం చేసిందని ఆరోపించారు. ప్రజలను, దేశాన్ని కాపాడాలనే నినాదంతో ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మికవర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, కోశాధికారి పీ ప్రేంపావని పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

