గీతానంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న సినిమా ‘గేమ్ ఆన్’. రవి కస్తూరి సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్, పమిడి క్రియేషన్స్ పతాకాలపై కుమార్ బాబు, రవి కస్తూరి, పమిడి రవితేజ నిర్మిస్తున్నారు. దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. దామరాజు, ఆదిత్య మీనన్, మధుబాల, శుభలేక సుధాకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ…‘రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రస్తుతం యువత ఎలా ఉన్నారు? ఎలా ఉండాలి? అనే అంశాన్ని ఈ కథలో చూపిస్తున్నాం. రెండు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.