గట్టు : ఎప్సెట్( EAPCET ) పరీక్షా ఫలితాల్లో గట్టు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల కళాశాల విద్యార్థినిలు ప్రతిభ కనబరిచారు. మండల కేంద్రం గట్టుకు చెందిన బి స్వాతి 369 వ ర్యాంకును( Rank) సాధించి ప్రతిభ కనబరిచింది. జి ఐశ్వర్య 981 ర్యాంకు, మణి కుమారి 1106వ ర్యాంకు ను సాధించింది. పదిమంది విద్యార్థినులు పదివేల లోపు ర్యాంకును సాధించారు.
బైపీసీ విభాగంలో 39 మంది విద్యార్థులకు గాను 39 మంది, ఎంపీసీ ( MPC ) విభాగంలో 39 విద్యార్థులకు గాను 36 మంది విద్యార్థులు అర్హతను సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, అధ్యాపక సిబ్బందిని కళాశాల ప్రిన్సిపాల్ బి శోభారాణి అభినందించారు.