హైదరాబాద్ : జగద్గిరిగుట్టలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడులో పలువురికి గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.