కరీంనగర్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన ప్రాజెక్టులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపో సే అవకాశం ఉన్నా.. రేవంత్ సర్కార్ నిర్ల క్ష్యం వల్ల సాగు, తాగునీటికి కష్టాలు తప్పడంలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి కండ్లు తెరిపించాలన్న ఉద్దేశంతో శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాక ర్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోయర్ మానే రు డ్యామ్ పరిధిలో వినూత్న నిరసన తెలిపారు.
నిజానికి లోయర్ మానేరు డ్యామ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ఐదున్నర టీఎంసీలు మా త్రమే నిల్వ ఉన్నాయి. ఇవి తాగునీటికి కూడా సరిపోలేని పరిస్థితి. నిజానికి బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 365 రోజులు నిండుకుండను తలపించిన లోయర్ మానేరు డ్యామ్ ఇప్పుడు వెలవెలబోతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే మైదానంలా మారింది. ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేసి రైతులకు అండ గా నిలువాలని, అలాగే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టులు నింపాలని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి గంగుల కమలాకర్ విజ్ఞప్తిచేశారు. స్పందించకపోవడంతో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
శనివారం లోయర్ మానేరు డ్యామ్‌లో పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి క్రికెట్, హాకీ, వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడు తూ.. ఎస్సారెస్పీ ద్వారా వరద కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ఆందోళనలు చేపడుతామ ని హెచ్చరించారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా రేవంత్ సర్కార్ చూపుతున్న నిర్లక్ష్యం వల్ల కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో లక్షలాది ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. సర్కార్‌కు చేతకాకపోతే కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి కన్నెపల్లిలో మోటర్లను ఆన్‌చేసి ప్రజలకు సాగు, తాగు నీరందించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ స్టేజీ-1, 2 ఆయకట్టుకు సాగునీటిని అందించడంలో లోయర్ మా నేరు డ్యామ్ అత్యంత కీలకం. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ మెయిన్ కెనాల్ ప్రారంభమై 146 కి.మీ వద్ద ఎల్ఎండీలో కలుస్తుంది. ఎల్ఎండీ నుంచి అంటే 146 కి.మీ నుంచి 284 కి.మీ వరకు ఎస్సారెస్పీ జోన్-2 ఆయకట్టుగా, అక్కడి నుంచి 347 కి.మీ వరకు ఆయకట్టును జోన్-3గా పిలుస్తారు. మొత్తంగా ఎల్ఎండీ నుంచే సాగునీటిని అందించాలి. ఇదిగాకుండా కరీంనగర్ పట్టణం, దాని చుట్టుపక్కల గ్రామాలకు, అదేవిధంగా వరంగల్, హనుమకొండ నగరాలు, ధర్మసాగర్తోపాటు పలు ప్రాంతాల తాగునీటి అవసరాలు ఎల్ఎండీపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటాయి.
అంతటి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలోనే ఎల్ఎండీని కాళేశ్వరం ప్రాజెక్టుతో అనుసంధానం చేశారు. అంతేకాదు నీటికొరతను తీర్చేందుకు ఎస్సారెస్పీ వరద కాలువకు, కాకతీయ కెనాల్‌ను అనుసంధానించారు. కాళేశ్వరం ద్వారా నిరంతరం జలాలను ఎల్ఎండీకి, తద్వారా దిగువకు జోన్-2, జోన్-3 సరఫరా చేశారు. అంతేకాదు తాగునీటికి ఇబ్బంది లేకుండాపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ వచ్చాక కాళేశ్వరం ఎత్తిపోతలను నిలిపేశారు. దీంతో ఎల్ఎండీలో నీటినిల్వలు లేకుండా పోయాయి. ఎల్ఎండీ దిగువన ఉన్న బోరు బావులే ఎండిపోతున్న దుస్థితి నెలకొన్నది.