ఖిల్లాఘణపురం, ఆగస్టు 19: వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మం డల కేంద్రంలోని గణపసముద్రం ఒండ్రుమట్టి తరలింపు వ్యవహారం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. గణపసముద్రం మరమ్మతులకు కేసీఆర్ ప్రభుత్వం రూ.47 కోట్లు కేటాయిస్తూ పనులకు అనుమతిచ్చింది. పనులను హర్ష కన్స్ట్రక్షన్ ప్రారంభించిన కొద్దిరోజులకే కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చింది. మం డలానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత 2 కోట్లు చెల్లించాలని, తర్వాతే పనులు చేయాలని డిమాండ్ చేసినట్టు ఆరోపణలున్నా యి. సాంకేతిక కారణాలతో గతంలో పనులు సాగ లేదని, ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చాక పనులు ప్రారంభించామని ఏఈ భరత్ తెలిపారు. గణపసముద్రంలో 630 ఎరకాలకుపైగా రైతుల పట్టా భూ ములు ఉన్నాయి.
గతంతో బీఆర్ఎస్ నాయకులు ఒండ్రుమట్టి తరలింపునకు ఎకరాకు రూ.1.80 లక్షలు చెల్లించేందుకు ముందుకొచ్చారు. కాంగ్రెస్ వచ్చాక ఏవీఆర్ సూచి ప్రసాద్ కన్స్ట్రక్షన్ వారితో మాట్లాడి కరివెన రిజర్వాయర్‌కు ఎకరాకు రూ.3.05 లక్షలకు మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయమై వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారడంతో కాంగ్రెస్ నేత మావిళ్ల అనిల్ రైతులతో గొడవకు దిగారు. రైతులంతా సోమవారం అనిల్ ఇంటికి వెళ్లగా.. అందుబాటులో లేడు. విషయం తెలుసుకున్న ఆయన కర్షకులపై ఖిల్లాఘణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పోలీస్‌స్టేషన్‌కు తరలిరాగా.. రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రూ.2 కోట్లు వసూలు చేసినట్టు అధారాలున్నాయని, కట్టమీది మైసమ్మ వద్దకు వస్తే చూపిస్తామని మాజీ ఎంపీపీ కృష్ణానాయక్ కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు.