Game of Thrones | గాట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. తెలుగులో రానున్న వరల్డ్ మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్
Game of Thrones | ఓటీటీలలో వెబ్ సిరీస్‌లు చూసేవారికి పరిచయం అక్కర్లేని లేని పేరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ (Game of Thrones - GOT). వెబ్‌సిరీస్‌ల మీద కొద్దిగా అవగాహన ఉన్నవారు కూడా దీని పేరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. ఇక ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక సిరీస్ ఏదైనా ఉంది అంటే అది గేమ్ ఆఫ్ థ్రోన్స్ (GOT) అని చెప్పక తప్పదు.
Game of Thrones | ఓటీటీలలో వెబ్ సిరీస్‌లు చూసేవారికి పరిచయం అక్కర్లేని లేని పేరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ (Game of Thrones – GOT). వెబ్‌సిరీస్‌ల మీద కొద్దిగా అవగాహన ఉన్నవారు కూడా దీని పేరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. ఇక ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక సిరీస్ ఏదైనా ఉంది అంటే అది గేమ్ ఆఫ్ థ్రోన్స్ (GOT) అని చెప్పక తప్పదు. మనీ హెయిస్ట్ (Money Heist), స్క్విడ్ గేమ్ (Squid Game), బ్రేకింగ్ బ్యాడ్ (Breaking Bad), స్ట్రేంజర్ థింగ్స్, మీర్జాపూర్ లాంటి పాపులర్ సిరీస్‌లు కూడా ఈ సిరీస్‌ను ఇప్పటివరకు బీట్ చేయలేక పోయాయి. అంతలా ఓటీటీ ప్రేక్షకులను ఇంపాక్ట్ చేసింది ఈ సిరీస్.
ఈ వెబ్ సిరీస్‌లో ఉండే జాన్ స్నో(Jon Snow), ఆర్య స్టార్క్ (Arya Stark), ది గ్రేట్ ఖలీసీ (The Great Khaleesi) వంటి క్యారెక్టర్లకు ఉన్న పాపులారిటీ వేరే ఏ వెబ్ సిరీస్‌లో ఇంతవరకు చూసి ఉండం. అంతగా ఫేమస్ అయింది గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఇదే క్రమంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ను మళ్లీ చూడాలనుకుంటున్న ఫ్యాన్స్‌కు సంతోషం కలిగించే విషయం ఒకటి బయటికి వచ్చింది.
ఇప్పటివరకు ఈ సిరీస్ ఇంగ్లీష్ భాషలో మాత్రమే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమా(JIO Cinema)లో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా ఈ సిరీస్ ఇండియన్ భాషల్లో జియో సినిమా విడుదల చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. ఇదే కనుక నిజమైతే గాట్ (GOT) ఫ్యాన్స్‌కు పండగ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఈ సిరీస్ చుడనివారు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ తదితర భారతీయ భాషల్లో చుడటానికి అవకాశం ఉంటుంది. అయితే దీనిపై జియో నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సిరీస్‌ను భారతీయ భాషల్లో జియో ఎప్పుడు అనౌన్స్ చేస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#Exclusive 🔥🔥🔥#GameOfThrones (2011/2019)
Epic Historical Fantasy War Adventure Series
Coming Very Soon In #Tamil #Telugu #Hindi #Malayalam #Kannada Language’s ✌️😁 @JioCinema
Most Of All Awaited Series To Watch Mother Tongue 😌
Must Watch Series 🔥💯 pic.twitter.com/eYwEdMD3fb
— Hollywood News In Tamil💯 (@HollywoodTamil0) August 14, 2023
#GameOfThrones in all south languages coming soon at Jio Cinema. pic.twitter.com/BcItUt3fLX
— RatpacCheck (@RatpacCheck) August 14, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

