ధాన్యం బస్తాలు తరలించాలని రైతుల నిరసన
మండలంలోని చిట్కుల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించాలని రైతు లు బుధవారం రాస్తారోకో, నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని,
చిలిపిచెడ్, మే 15 : మండలంలోని చిట్కుల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించాలని రైతు లు బుధవారం రాస్తారోకో, నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని, బస్తా కు మూడు కిలోల తరుగు తీయడాన్ని నిరసిస్తూ మెదక్-సంగారెడ్డి రహదారిపై రైతులు పెద్దఎత్తున రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. సోమక్కపేట పీఏసీఎస్ సిబ్బంది అక్కడకు చేరుకొని సివిల్ సప్లయ్ డీఎంతో ఫోన్లో మాట్లాడి రైతులను సముదాయించారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించే వరకు రోడ్డుపై నుంచి జరిగేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన..సీఎం రేవంత్ రెడ్డి డౌన్‌డౌన్ అంటూ రైతులు నినాదాలు చేశారు. డీఎం ఫోన్లో మాట్లాడి తూకం వేసిన ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. రాస్తారోకోలో రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

