అచ్చంపేట టౌన్, మే 15 : ‘ఏ వ్యవస్థ అయితే నా విశాల కుటుంబం అని అనుకున్నానో.. ఆ వ్యవ స్థే నేడు ప్రేక్షక పాత్ర వహించడం నా హృదయాన్ని కలచివేసింది’ అని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించి రాష్ట్రపతి చేతుల మీదు గా అత్యున్నత శౌర్య పథకాన్ని అందుకున్నట్లు ఆ యన గుర్తు చేశారు. బుధవారం ఆర్ఎస్పీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుతో కలిసి విలేకరులతో సమావేశమై మాట్లాడారు. తమ పార్టీ నేతలపై దాడి జరగడం బాధాకరమన్నారు. పార్టీలకతీతంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసు వ్యవ స్థ.. తమ ముందే దుండగులు సెంట్రింగ్ కర్రలతో దాడి చేసినా ఇప్పటివరకు వారిని అదుపులోకి తీసుకోకపోవడం శోఛనీయమన్నారు. బాధితుడు బె డ్రూంలోకి ఉండి అరగంట వరకు పోలీసులకు స మాచారమిచ్చాడన్నారు. దాదాపు 15-20 మంది దాడి చేయడాన్ని పోలీసులు ప్రత్యక్షంగా చూసి కూడా వారిని పట్టుకోకుండా.. ఇప్పుడు పరారీలో ఉన్నారని చెప్పడం ఎన్నో అనుమానాలకు తావిస్తుందన్నారు. సాయినగర్‌లోని పోలింగ్ బూత్ వద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిన వెంటనే ఆ ప్రాంతా ల్లో మళ్లీ గొడవ జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అలాంటి చర్యలేవీ తీసుకోలేదన్నారు.
దాడికి పాల్పడిన వారిని శిక్షించేందుకు ఎంత వరకైనా వెళ్తామని.. డీఎస్పీ, ఎస్పీ, హ్యూమన్ రైట్స్‌ను సైతం ఆశ్రయించి వారిని శిక్షించే వరకు నిద్రపోమని స్పష్టం చేశారు. పోలీసులు.. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నారా? లేక రేవంత్‌రెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే ఆదేశానుసారం పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై ఉ న్నతాధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశా రు. వంగూర్‌లో మైనర్లు ఓట్లు వేస్తున్నారని స్థానిక బీఆర్ఎస్ నాయకుడు కోట్ల నరేందర్‌రావు బూత్ లెవల్ అధికారికి ఫిర్యాదు చేస్తే.. రంగారావు, సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడు చింతలరెడ్డి ఆదేశాల మేరకు కంప్లెంట్ ఇస్తావా అని నరేందర్‌రావు తమ్ముడు ప్ర శాంత్రావుపై దాడి చేశారన్నారు. అయితే దాడి చేసి న వారిని వదిలేసి బాధితుడిపై కేసు నమోదు చేయ డం అమానుషమన్నారు. రూలింగ్ పార్టీ ఇచ్చిన కం ప్లెంట్ను తీసుకొని ప్రతిపక్షం వాళ్ల ఫిర్యాదును వదిలివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో ని నాలుగు కోట్ల ప్రజల రక్షణ హోం శాఖ మంత్రి హోదా లో ఉన్న రేవంత్‌రెడ్డి చేతుల్లోనే ఉంది.. మీ సొంత నియోజకవర్గంలో ప్రతిపక్షం వారిపై సెం ట్రింగ్ కర్రలతో దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోలేదు.. అలాంటిది రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుకుంటారు’ అని ప్రశ్నించారు. గువ్వల బాలరాజు, మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహాగౌడ్ ప్రాణాలకు సైతం ప్రమాదమున్నదని, ఏమైనా జరిగితే రేవంతే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
గువ్వల బాలరాజు మాట్లాడుతూ ‘ప్రతిదాడి తమ సంస్కృతి కాదు.. ఇంత జరిగినా పోలీసులు చోద్యం చూస్తున్నారు.. అధికార పార్టీకి వత్తాసు ప లుకుతున్నారు’ అని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గూండాల్లా బీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి నిర్మలాబాలరాజు ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. 15 ఏండ్లుగా ఓడిపోయి నేడు ఎమ్మె ల్యే అయిన వంశీకృష్ణ అక్రమ సంపాదనకు మరిగారని.. మూర్ఖపు నైజం కలిగిన తన టీంను ప్రోత్సహి స్తూ దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. అక్రమ మైనింగ్‌కు ఆటంకం లేకుండా ప్రశ్నించే గొంతుకలు ఉండకూడదని అణచివేత ధోరణిని అ వలంబిస్తున్నారని విమర్శించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని.. చట్టం దుర్మార్గుల కు చుట్టంగా మారిందని.. ప్రజలంతా దీనిపైనే చర్చించుకుంటున్నారన్నారు. అధికార పార్టీకి వత్తా సు పలుకుతూ.. వారి ఆదేశానుసారం పని చేయ డం సరైంది కాదన్నారు. పోలీసుల సమక్షంలో బీఆర్ఎస్ నేతలపై దాడులు జరిగినా.. ఇప్పటివరకు ఎ వరినీ అరెస్టు చేయకపోవడం బాధాకరమని.. దీని ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇసుకను హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేస్తూ 18, 20 టైర్ల వాహనాల్లో ఓవర్ లోడ్‌తో తీసుకెళ్తూ తమ ప్ర భుత్వం వేసిన రోడ్లను నాశనం చేస్తున్నారని దు య్యబట్టారు.
అక్రమ సంపాదనకు మరిగి, ఇసుక ను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాం లో యురేనియం తవ్వకాలకు అనుమతులిచ్చార ని.. ఉద్యమ సమయంలో వారు తీసుకొచ్చిన వా హనాలను వెనక్కి పంపించామని గుర్తు చేశారు. తా ము చట్టసభల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని వివరించారు. ఇప్పుడు మళ్లీ మైనింగ్ మా ఫియాను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చి న హామీలను అమలు చేయలేక, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి దాడులకు పూనుకోవడం సరికాదన్నారు. దొంగ ముఠా సంస్థలను పెంచి పోషించడానికి వ్యాపారులపై ఒత్తిడి పెంచి వసూళ్లకు పాల్పడుతున్న సంఘ విద్రోహ శక్తులను స్థానిక ఎమ్మెల్యే వెనుకేసుకు రావడం మంచిది కాదన్నారు. జైల్లో ఉన్నవారిని బయటికి తీసుకొచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.. మీ తా టాకు చప్పుళ్లకు భయపడం.. ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డాం.. ప్రజల జీవితాలతో చెలగాటమాడితే స హించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో ము న్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహాగౌడ్, కౌన్సిలర్లు సుం కరి నిర్మలాబాలరాజు, శంకర్, మన్నూపటేల్, రమేశ్‌రావు, కుతుబుద్దీన్, జెడ్పీటీసీ రాంబాబు, బీఆర్ఎస్ నాయకుడు అమీనుద్దీన్ తదితరులు ఉన్నారు.