పీఏ: ఏమయ్యింది సార్ ? వేడి చేసిందా, లస్సీ తాగుతరా?
రేవంత్ : నాకేం వేడి చేయలె.
పీఏ: మరి ఎందుకు సార్ కంట్రోల్ తప్పుతున్నరు?
రేవంత్ : నీకు తెలుసు కదయ్యా.. నా నోటికి కంట్రోల్ అనేదే ఉండదని
పీఏ: మీ చేతులకు కూడా ఉండదు. మనోళ్లనే ఇష్టమున్నట్టు కొడుతున్నరు. ఇప్పుడు తన్నుడు గిట్ల స్టార్ట్ చేసిర్రు.
రేవంత్ : ఏంజేయాలయ్యా.. కోపం ఆపులేకపోతున్న
పీఏ: దాన్ని కోపం అనరు సార్.. ఫ్రస్ట్రేషన్ అంఅదిటరు. అయినా ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్
రేవంత్ : మూడు గంటల కరెంటు ముచ్చటను ఎంత సమర్థించుకుందామన్నా రివర్స్ కొడుతుందయ్యా
పీఏ: అయినా అధికారంలోకి వస్తే ఎట్లగూ సైలెంట్‌గా చేసేస్తం కదా సార్. ముందే ఎందుకు బయటపెట్టిర్రు.
రేవంత్ : మనసులో ఉన్నది తన్నుకుంటూ బయటకు వచ్చేస్తదయ్యా. అది నా వీక్నెస్.
పీఏ: అందుకే సార్ జర మీరు కంట్రోల్లో ఉండాలె అంటున్నా.
– వరుణ్