తాళ్లపేట కాంగ్రెస్‌లో మంటలు
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణలు చల్లారడం లేదు. సద్దుల బతుకమ్మ రోజు జరిగిన గొడవను మరువక ముందే దసరా పండుగ రోజు మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జిల్లా స్థాయి పోలీసు అధికారులు, సీఐలు, ఎస్సైలతోపాటు భారీగా పోలీసు సిబ్బందితో పికెట్ ఏర్పాటు చేసినా ఎమ్మెల్యే-ఎంపీ వర్గీయులు ఢీ అంటే ఢీ అంటున్నారు.
- మళ్లీ ఘర్షణకు దిగిన ఇరువర్గాలు
- పోలీస్ పహారా ఉన్నా.. ఉద్రిక్తతలు
- ఎమ్మెల్యే-ఎంపీ వర్గీయుల ఢీ అంటే ఢీ
- దసరా రోజు పరస్పర దాడులు
- గాయపడిన ఎమ్మెల్యే వర్గీయులు
దండేపల్లి, అక్టోబర్ 21 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణలు చల్లారడం లేదు. సద్దుల బతుకమ్మ రోజు జరిగిన గొడవను మరువక ముందే దసరా పండుగ రోజు మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జిల్లా స్థాయి పోలీసు అధికారులు, సీఐలు, ఎస్సైలతోపాటు భారీగా పోలీసు సిబ్బందితో పికెట్ ఏర్పాటు చేసినా ఎమ్మెల్యే-ఎంపీ వర్గీయులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇరువర్గాల నాయకులు ఏ మాత్రం తగ్గకపోవడంతో తాళ్లపేట విషయం పోలీసులకు సవాల్‌గా మారింది.
దసరా పండుగ రోజు జరిగిన దాడుల్లో ఎమ్మెల్యే వర్గానికి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. తాళ్లపేటకు చెందిన పేరం రజిత, ఆకుల రాజేంద్రప్రసాద్, ఆకుల అకిరానందన్ జమ్మికి వెళ్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఆకుల కిరణ్‌కుమార్, రాజేందర్, సురేశ్, విజయవర్ధన్, ముత్తె కుమారస్వామి, ఎర్రం మల్లేశ్ వారి ఇంట్లోకి ప్రవేశించి, అసభ్య పదజాలంతో దూషిస్తూ కర్రలతో దాడులు చేశారు. ఈ దాడిలో ఆకుల రాజేంద్ర ప్రసాద్, అకిరానందన్ తలలకు, పేరం రజిత చేతికి గాయాలయ్యాయి.
ఈ ఘటనపై పోలీసులు ఆకుల కిరణ్, సురేశ్, విజయ్‌వర్ధన్, ఎర్రం మల్లేశ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా తాళ్లపేటలో గాయపడిన వారిని మంచిర్యాలలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు. ఈ ఘటన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో పోలీసులు భారీగా మోహరించారు. ఎంపీ ప్రధాన అనుచరుడు మంతెన జగన్మోహన్రావు అరెస్టుకు రంగం సిద్ధమైందంటూ ఓ వైపు ప్రచారం జరిగింది. మరో వైపు పీఎస్ఆర్ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు.. జగన్మోహన్రావు ఇంటిపై దాడికి పాల్పడే అవకాశం ఉన్నదన్న సమాచారంతో అప్రమత్తమైనట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

