హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 21న నీట్ రీ-ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి శుక్రవారం తెలిపారు.
దాదాపు 73 వేల మంది అ భ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. ఆటంకాలు ఎదురైతే ఆర్టీసీ కాల్ సెం టర్ నంబర్లు 040-23450033, 68153333ల్లో సంప్రదించాలని సూచించారు.