కొరియన్ థ్రిల్లర్స్‌ని తలపించే యాక్షన్
కథానాయకుడి పాత్రను బోల్డ్‌గా చూపించడం సందీప్‌రెడ్డి వంగా ైస్టెల్. అంతేకాదు, యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా పరిధులకు మించే ఉంటుంది. అందుకే యువతరానికి సందీప్‌రెడ్డి వంగా సినిమా అంటే పూనకాలు వచ్చేస్తుంటాయి. అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్, యానిమల్ సినిమాలతో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా అవతరించారు సందీప్.
కథానాయకుడి పాత్రను బోల్డ్‌గా చూపించడం సందీప్‌రెడ్డి వంగా ైస్టెల్. అంతేకాదు, యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా పరిధులకు మించే ఉంటుంది. అందుకే యువతరానికి సందీప్‌రెడ్డి వంగా సినిమా అంటే పూనకాలు వచ్చేస్తుంటాయి. అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్, యానిమల్ సినిమాలతో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా అవతరించారు సందీప్. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కాప్‌గా చేయడం ఇదే ప్రథమం. దాంతో అభిమానులు ‘స్పిరిట్’కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ ఎరుగని యాక్షన్ సీక్వెన్స్‌ని ‘స్పిరిట్’లో చూడబోతున్నట్టు చిత్రబృదం చెబుతున్నది.
‘దురంధర్- 2’ని మించిన యాక్షన్ సీక్వెన్స్ ‘స్పిరిట్’లో ఉంటాయట. ఇందులోని యాక్షన్ కొరియన్ థ్రిల్లర్స్‌ని తలపిస్తుందని యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొరియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు కూడా ‘స్పిరిట్’ కోసం పనిచేస్తున్నారట. ఇదిలావుంటే.. ఈ సినిమాలో సంగీతానికి కూడా మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలిసింది. హర్షవర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన స్వరాలను అందించారని చెబుతున్నారు. ఇటీవలే ప్రభాస్ పరిచయ గీతాన్ని కూడా చిత్రీకరించారట. ప్రభాస్‌కి జోడీగా త్రిప్తి డిమ్రీ నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

