ఉచిత శిక్షణ గడువు 18 వరకు
హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): పోటీ పరీక్షల కోసం దివ్యాంగ అభ్యర్థులకు అందించనున్న ఉచిత శిక్షణ దరఖాస్తు గడువును ఈ నెల 18 వరకు పొడిగించినట్టు రాష్ట్ర వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సదరమ్ సర్టిఫికెట్ కలిగి, గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించని అభ్యర్థులు, కోచింగ్ తీసుకొని మూడేండ్లు దాటినవాళ్లు అర్హులని వెల్లడించింది. ఉచిత కోచింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు సెలక్షన్ కమిటీ సూచించిన జాబితాలోని ఏదైనా ఇన్స్టిట్యూట్ను ఎంచుకోవచ్చని, అభ్యర్థులకు ట్యూషన్ ఫీ కింద కనిష్ఠంగా రూ.7 వేలు, గరిష్ఠంగా రూ.20 వేలు, స్టడీ మెటీరియల్ కోసం రూ.1000తో పాటు ఇతర ఖర్చులకు రూ.2 వేల చొప్పున మూడు నెలల పాటు అందించనున్నట్టు పేర్కొన్నది. వివరాలకు జిల్లాల్లోని స్త్రీ శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారులను లేదా 040 24559048 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
దరఖాస్తుల వివరాలు
పేపర్ మొత్తం
పేపర్ -1 3,38,128
పేపర్ -2 2,65,907
మొత్తం 6,04,035
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

