మహిళలకు ఆత్మైస్థెర్యంతో పాటు సొంతంగా వ్యాపారం ప్రారంభించేలా నిర్మాణ్ సంస్థ అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బ్యూటిషియన్, టైలరింగ్‌లో ఆధునిక శిక్షణ ఉచితంగా అందిస్తుంది. ప్రతీ ఏడాది ఈ తరహా శిక్షణలు ఇస్తూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతుంది. వీటితో పాటు టెక్నికల్ కోర్సులు, స్పోకెన్ ఇంగ్లిష్ తదితర కోర్సుల్లో ప్రావీణ్యం సాధించేలా నిష్ణాతులతో బోధన ఇప్పిస్తుంది. వేలాది మందికి ఉపాధిని చూపించి సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోంది నిర్మాణ్. తాజాగా మళ్లీ బ్యూటిషియన్, టైలరింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తిగల మహిళలు 6309987154,9121214057 నెంబర్లను సంప్రదించాలి.
టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2014లో నిర్మాణ్ సంస్థ ఏర్పడింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వారికి అండగా నిలువడంలో క్రియాశీలకపాత్ర పోషిస్తోంది. చాలా మంది బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ కంప్యూటర్స్ వంటి ఉన్నత చదువులు చదివి కూడా ఉద్యోగానికి దూరంగానే ఉండిపోతున్నారు. ప్రాథమిక అర్హతలు ఉన్నా ఇంటర్వ్యూలలో వెనుకబడిపోతున్నారు. ఈ కాలంలో ఉద్యోగం సంపాదించాలంటే అదనపు అర్హతలు అవసరం. ఈ విషయం ఇంటర్వ్యూ ఎదుర్కొంటేగానీ బోధపడదు. అలాంటి వారి కోసమే నిర్మాణ్ పని చేస్తోంది. శిక్షణలో ఇంటర్వ్యూ స్కిల్స్, సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్, బూట్స్రాప్, కోర్, జావా, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్, ఆంగ్యులర్, బిజినెస్ ఇంగ్లిష్ తదితర వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ డిజైనింగ్ కోర్సులలో కూడా శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం టైలరింగ్, బ్యూటిషియన్లలో కూడా శిక్షణ ప్రారంభించారు.
వీటిపై శిక్షణ
అడ్వాన్స్డ్ బ్యూటిషియన్, మెహందీ, పెడిక్యూర్, ఫేషియల్, క్లీన్ అప్ తదితర బ్యూటీ వర్క్స్, అన్ని రకాల దుస్తుల స్టిచ్చింగ్, ఆధునిక మోడల్స్‌లో డ్రెస్సులు, ఎంబ్రాయిడరీ, మగ్గం తదితర అన్ని అంశాల్లో పూర్తిస్థాయిలో మెళకువలు నేర్పిస్తారు. మూడు నెలల పాటు శిక్షణ ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం బ్యాచ్‌లుగా శిక్షణ ఇస్తారు. ఒక్కో బ్యాచ్‌కు 25 మందిని తీసుకుంటారు. హైదరాబాదీలకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వయస్సు 18 నుంచి 40 ఏండ్ల లోపు ఉండాలి. ఫతేనగర్ బ్రిడ్జి పక్కన ఉన్న 11-32 మొదటి అంతస్తులో శిక్షణ కార్యాలయం ఉంటుంది.
మంచి అవకాశం
ఇప్పటి వరకు వందలాది మందికి శిక్షణ ఇచ్చాం. వారంతా కొన్ని రోజులు బ్యూటీ రంగంలో ఉద్యోగాలు చేసి సొంతంగా పార్లర్స్ ఏర్పాటు చేసుకున్నారు. మహిళలకు ఇదొక మంచి అవకాశం. నిర్మాణ్ సంస్థ అందిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. బ్యూటిషియన్‌పై పూర్తి అవగాహన వచ్చేలా శిక్షణ కొనసాగుతుంది. గతంలో కరోనా కారణంగా ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పుడు మళ్లీ ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభించబోతున్నాం. ఆసక్తిగల వాళ్లు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఉచితంగా శిక్షణ
టైలరింగ్‌లో పూర్తి స్థాయి శిక్షణ ఇస్తాం. అన్ని రకాలు దుస్తులు కుట్టేలా తీర్చిదిద్దుతాం. కుట్టు మిషన్ పనితీరును వివరిస్తాం. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. శిక్షణ తీసుకొని మరికొందరికి ఉపాధినిచ్చేలా ఎదగాలి. ప్రస్తుతం బ్యూటిషియన్, టైలరింగ్‌లో శిక్షణ తీసుకోవాలంటే బయట వేల రూపాయల్లో చార్జ్ చేస్తుంటారు. మా దగ్గర ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. టైలరింగ్ ఉద్యోగాలు కూడా చూపిస్తాం. అవసరమైతే సొంతంగా దర్జీ షాపులు పెట్టుకునేలా శిక్షణ అందిస్తాం.