ఫ్రాన్స్ సెనేట్‌లో ప్రసంగించండి

- భారత్-ఫ్రాన్స్ భావి సంబంధాలపై విశ్లేషించండి
- మంత్రి కేటీఆర్‌కు ఫ్రెంచ్ ప్రభుత్వం ఆహ్వానం
- ఇది తెలంగాణ విధానాలకు గుర్తింపు: మంత్రి కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అం దింది. ఫ్రాన్స్ ఎగువ సభలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా ఆ దేశ ప్రభుత్వం మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. ఇప్పటికే పలు దేశాలు, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించిన కేటీఆర్.. 348 మంది సభ్యులున్న ఫ్రెంచ్ సెనేట్‌లో కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ నెల 29న ఫ్రెంచ్ సెనేట్ లో ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మాక్రాన్ సారథ్యంలో ‘అంబిషన్ ఇండియా-2021’ పేరుతో వాణి జ్య సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం కేటీఆర్‌ను కోరింది. ఈ సదస్సు భారత్- ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని ఫ్రాన్స్ ప్రభుత్వం పంపిన లేఖలో పేర్కొన్నది. సదస్సులో ‘గ్రోత్-డ్రాఫ్టింగ్ ఫ్యూచ ర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కొవిడ్ ఎరా (కొవిడ్ తర్వాత భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలు) అనే అంశంపై కీలక ఉపన్యాసం చేయాలని కోరింది. ఇలాంటి కీలక వేదికపై తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు అవకాశం కలుగుతుందని వెల్లడించింది. సదస్సులో వైద్యారోగ్యం, పర్యావరణ మార్పులు, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, ఆగ్రో బిజినెస్ వంటి ప్రధానమైన అంశాలపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్టు వివరించింది. దీంతోపాటు ఫ్రాన్స్-భారత కంపెనీల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయని తెలిపింది. గతంలో నిర్వహించిన ఆంబిషన్ ఇండియా సదస్సులో సుమారు 700 మంది వ్యాపార, వాణిజ్య భాగస్వాములు, ఇరు దేశాల కంపెనీల నుంచి 400కు పైగా ప్రతినిధులు పాల్గొన్నారని పేర్కొన్నది. ఈసారి అంతకుమించి కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్టు తెలిపింది. సెనేట్ అనేది మన దేశంలోని రాజ్యసభ మాదిరిగా పనిచేస్తుంది.
రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను పరిచయం చేస్తా: కేటీఆర్
ఫ్రాన్స్ ఆహ్వానం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దకిన గుర్తింపుగా అభివర్ణించారు. సదస్సు వేదికగా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ఇరు దేశాల వ్యాపార, వాణిజ్య భాగస్వాములు, కంపెనీల ప్రతినిధులకు వివరిస్తానని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

