మహబూబ్ నగర్ కలెక్టరేట్ : ఎంవీఎస్( MVS) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో నూతనంగా నాలుగు నైపుణ్యాధారిత కోర్సులను ( Courses ) ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మావతి (Principal K Padmavati) వెల్లడించారు. శనివారం కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న కోర్సులకు అదనంగా కొత్త కోర్సులు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. దోస్త్( DOST) -2025 ద్వారా అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. కొత్తగా ప్రవేశ పెట్టిన కోర్సుల వివరాలను వెల్లడించారు.
బీఎస్సీ డిజిటల్ మార్కెటింగ్( Digital Marketing) , అడ్వర్టైజింగ్ కోర్సులో చేరడానికి విద్యార్థులు ఇంటర్ ఎంపీసీలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈ కోర్సు పూర్తి చేసుకుంటే మార్కెటింగ్ పరిశ్రమలు, అనేక ప్రజా సంస్థలలో వేతనంతో అవకాశాలు పొందవచ్చన్నారు. బీఎస్సీ మార్కెటింగ్ అండ్ సేల్ (ఫార్మా మార్కెటింగ్) కోర్సులో చేరడానికి ఇంటర్లో బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలని ఈ కోర్సు పూర్తి చేస్తే భవిష్యత్తులో సేల్స్ మేనేజర్, అక్కౌంట్స్ మేనేజ్, మార్కెటింగ్ అసిస్టెంట్ వంటి అనేక ఉద్యోగాలను పొందవచ్చని సూచించారు.
బీఎస్సీ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ కోర్సులో చేరేందుకు బైపీసీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు. ఆసుపత్రులు, క్లినిక్, ఇన్సూరెన్స్ కంపెనీలలో, ప్రజారోగ్య సంస్థలలో ఉద్యోగావకాశాలు పొందవచ్చు అని వివరించారు. బీకామ్ బీఎఫ్ఎస్ఐ ఐ కోర్సులో చేరేందుకు ఇంటర్ఎంపీసీ, బైపీసీ పూర్తి చేసిన వారు అర్హులని ఈ కోర్సును పూర్తి చేస్తే ఎంఎస్బీసీ , జేపీ మొర్గాన్, స్టేట్ స్ట్రీట్, మ్యూచువల్ కంపెనీలు, స్టాక్ ఎక్చేంజ్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీలలో అధిక వేతనంతో ఉద్యోగాలను పొందవచ్చని తెలిపారు.
నైపుణ్యాధారిత కోర్సులను అభ్యసించే విద్యార్థులు మొదటి రెండు సంవత్సరాల సమయంలో కళాశాలలో అభ్యసన కార్యక్రమం, మూడో సంవత్సరంలో గుర్తింపు పొందిన కంపెనీలు లేదా సంస్థలలో వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నారు. దోస్త్ లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మొదటి విడత (ఫేజ్-1) లో ఈ నెల 21వ తేదీ వరకు రూ.200లు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్స్ 22వ తేదీ వరకు ఇచ్చుకోవాలని సూచించారు. సీట్ల కేటాయింపు ఈ నెల 29 ఉంటుందన్నారు.
సెల్ఫ్ రిపోర్టింగ్ ఈ నెల 30 నుంచి జూన్ 6వ తేదీ వరకు గడువు ఉంటుందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని క్రిస్టియన్‌పల్లిలోని ఎంవీఎస్ డిగ్రీకళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ కూడా అందుబాటులో ఉందన్నారు. దోస్త్ అడ్మిషన్స్‌కు సంబంధించిన దరఖాస్తులు, ఇతర వివరాలకు కో- ఆర్డినేటర్ డాక్టర్ బిరవీందర్రావు, సెల్ నం. 98851 84432 , టెక్నికల్ అసిస్టెంట్ సి తేజస్విని సెల్ నం. 89779 80981, సపోర్టింట్ స్టాప్ బి. కళ్యాణి సెల్ నంబర్ 89191 13032లను సంప్రదించవచ్చని ప్రిన్సిపాల్ పద్మావతి సూచించారు.