అమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం ( Tragedy incident ) చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో ( Tungabadra River ) స్నానానికి దిగి నలుగురు మృతి చెందారు. కోసిగి మండలం ఆర్టీఎస్ ( RDS ) ఆనకట్ట వద్ద స్నానానికి దిగగా నీటి ప్రవాహానికి నలుగురు ఘల్లంతై మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. కందుకూరులో బంధువుల పెళ్లికి వచ్చిన 15 మంది తుంగభద్ర నదిలో స్నానాలకు దిగారు. మృతి చెందిన వారు కర్ణాటకలోని మాన్వి పరిధి కురిడి గ్రామస్థులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.