Chiranjeevi | నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.. కొడుకు పుట్టినరోజున మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్!
Ram Charan Birthday | మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడికి అత్యంత భావోద్వేగంతో కూడిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Ram Charan Birthday | మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడికి అత్యంత భావోద్వేగంతో కూడిన శుభాకాంక్షలు తెలియజేశారు. తన సోషల్ మీడియా వేదికల ద్వారా చరణ్ చిన్నప్పటి అరుదైన ఫోటోలను పంచుకున్న చిరంజీవి, “చరణ్ బాబు.. చిన్నప్పుడు నా చేయి పట్టుకుని నడక నేర్చినప్పటి నుంచి, నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే స్థాయికి నీవు ఎదగడం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు. సినిమా కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ, కుటుంబం పట్ల బాధ్యతగా ఉండటమే కాకుండా దైవచింతన, క్రమశిక్షణ వంటి విలువలను పాటిస్తున్న చరణ్‌ను చూస్తుంటే తనలో ప్రేమ మరియు గౌరవం ప్రతిరోజూ పెరుగుతూనే ఉంటాయని చిరు ఆనందం వ్యక్తం చేశారు. దేవుడి ఆశీస్సులు, అభిమానుల ఆదరాభిమానాలు చరణ్‌ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆయన మనసారా ఆకాంక్షించారు.
మరోవైపు చరణ్ పుట్టినరోజు కానుకగా ఆయన తదుపరి చిత్రం ‘పెద్ది’ నుంచి ఈరోజే ప్రత్యేక గ్లింప్స్ విడుదలైంది. ఇందులో ‘పెద్ది పహిల్వాన్’గా చరణ్ పవర్ఫుల్ బాడీతో, కొత్త గెటప్‌లో కనిపించి అభిమానులను అలరిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే క్రమంలో చరణ్ ఉదారతను చాటుతూ, డ్యాన్సర్ల హెల్త్ ఇన్సూరెన్స్ కోసం 40 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వెల్లడించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉపాసన, సుస్మిత కొణిదెల, అన్నా కొణిదెలతో పాటు సినీ ప్రముఖులు చరణ్‌కు పెద్ద ఎత్తున విషెస్ తెలియజేస్తున్నారు. చిరంజీవి షేర్ చేసిన చిన్నప్పటి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

