AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, అప్పుతో కలసి చెల్లిస్తాం
AP News | వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి : వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ( Peddireddy Ramchander reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు అప్పుతో కలసి తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. గత ఎన్నికల్లో ఈవీఎం (EVM ) లు లేకపోతే వైఎస్ జగన్ చెప్పినట్లు వై నాట్ 175 సీట్లు వైసీపీ తప్పక గెలిచేదని అన్నారు. ఆ ఫలితాలు రాకుండా ఈవీఎంలు పనిచేశాయని ఆరోపించారు.
ఈసారి ఈవీఎంలు గాని, మరేదైనా పెట్టుకున్న వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ మోహన్రెడ్డి సీఎం అవుతారని ధీమాను వ్యక్తం చేశారు. పుంగనూరులో పోలీసులు కూడా గాయపడ్డారని తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ గూండాలు నామినేషన్ల కేంద్రాల వద్ద దాడులకు పాల్పడ్డారని, వైసీపీ అభ్యర్థుల పోటీ వల్ల తాము ఓడిపోతామన్న భయంతో వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల పత్రాలను లాక్కున్నారని ఆరోపించారు.
పుంగనూరుకు బయట రాష్ట్రాల నుంచి వ్యక్తుల నుంచి తీసుకొచ్చి దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ, అధికారులు నీతివంతమైన పాలన బదులు బంట్రోతుల మాదిరిగా చంద్రబాబు చెప్పిన విధంగా పనిచేస్తున్నారని విమర్శించారు. అధికార పక్షానికి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులకు తగిన బుద్ది చెప్పడం ఖాయమని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, అప్పుతో కలసి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

