హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను ఏపీ పోలీసులు గురువారం హైదరాబాద్‌లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. విజయవాడకు తీసుకెళ్లిన ఏపీ పోలీసులు ముందుగా భవానీపురం పీఎస్‌కు తరలించారు. అక్కడ నుంచి కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్క డ విచారించిన తరువాత వై ద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి, పరీక్షల అనంత రం గవర్నర్‌పేటలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యా యస్థానంలో హాజరుపరిచారు. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నాడు.