హైదరాబాద్ : కంటోన్మెంట్ మాజీ శాసన సభ్యుడి మచ్చేందర్ రావు మృతి పట్ల మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Thalasani Srinivas Yadav) సంతాపం వ్యక్తం చేశారు. నిన్న అనారోగ్యంతో మృతి చెందిన మచ్చేందర్ రావు అల్వాల్ లోని నివాసానికి వెళ్లి భౌతిక కాయాన్ని శనివారం సందర్శించి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ మొదటి ఎమ్మెల్యేగా మచ్చేందర్ రావు(96) నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలకు అందించిన సేవలు మరవలేనివని అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు.