కేశంపేట, ఆగస్టు 1 : కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్న ప్రజలు, యువత అధికార పార్టీని కాదని బీఆర్ఎస్లో చేరుతున్నారని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని కోనాయపల్లి గ్రామానికి చెందిన ఏబీవీపీ నాయకుడు నరేందర్ తన అనుచరులతో కలిసి శనివారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అంజయ్యయాదవ్ మాట్లాడుతూ..అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
30 నెలలు దాటినా ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. భవిష్యత్తు బీఆర్ఎస్దేనన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, సర్పంచ్‌లు ధనలక్ష్మీరామకృష్ణ, వేణుగోపాలచారి, మాజీ సర్పంచ్ నవీన్‌కుమార్, నాయకులు శ్రీహరియాదవ్, శ్రీకాంత్, సలీమ్, సంతోష్‌రెడ్డి, సునిల్, చెన్నయ్య, మహేశ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.