ఎండిన పంటలు కన్పిస్తలేవా?
సాగునీరు అందక పంటలు ఎండిపోయినందున ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్ రూరల్ మండలం మాచన్‌పల్లి శివారులో ఎండిన వరి పంటలను బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. వానకాలం సీజన్లో బోర్లు, కాలువలు వట్టిబోయి సాగునీరందక, కరెంట్ లేక రైతులు అరిగోస పడుతున్నారని తెలిపారు.
- వెంటనే రైతులకు పరిహారమివ్వాలి
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- మాచన్పల్లిలో పంటల పరిశీలన
పాలమూరు, అక్టోబర్ 31 : సాగునీరు అందక పంటలు ఎండిపోయినందున ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్ రూరల్ మండలం మాచన్‌పల్లి శివారులో ఎండిన వరి పంటలను బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. వానకాలం సీజన్లో బోర్లు, కాలువలు వట్టిబోయి సాగునీరందక, కరెంట్ లేక రైతులు అరిగోస పడుతున్నారని తెలిపారు. రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటే.. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
ప్రస్తుతం పాలమూరు మీదుగా వెళ్తున్న కృష్ణా జలాలను ఏపీలోని కుప్పంకు అక్కడి సీఎం చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్నా, మన పాలకులకు సోయి లేకుండా పోయిందని విమర్శించారు. పాలమూరు, కేఎల్ఐ మోటర్లు ఆన్‌చేసి రిజర్వాయర్లు నింపాలని బీఆర్ఎస్ అల్టిమేటమ్ జారీ చేస్తే మొక్కుబడిగా ఆన్ చేసి.. వెంటనే బంద్ చేశారని దుయ్యబట్టారు. అసలు ఈ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉన్నదా? అని ప్రశ్నించారు. ఇప్పటికే పంటల పెట్టుబడికి అప్పులు తెచ్చి పెట్టారని.. సాగు చేసిన పంటలు చేతికి రాకుండా నష్టపోవడంతో అప్పులు తీర్చే మార్గం రైతులకు కనిపించడం లేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా పరిహారం అందించి అన్నదాతలను ఆదుకోవాలని.. లేదంటే తిరగబడుతారని హెచ్చరించారు.
మహిళా రైతు కన్నీటిపర్యంతం
మాచన్‌పల్లి శివారులో ఎండిన వరి పంటలను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలిస్తుండగా.. మహిళా రైతు సుజాత కన్నీటి పర్యంతమయ్యారు. తనభర్త చనిపోయాడని.. రూ.లక్ష న్నర అప్పుచేసి ఐదెకరాల్లో వరి సాగు చేశానని తెలిపింది. వానల్లేక మొత్తం పంట ఎండిపోయిందని వాపోయింది. ఉండటానికి ఇల్లు కూడా లేదని, భర్త చనిపోయినా రైతు బీమా రాలేదని విలపించింది. అధికారులను అడిగినా స్పందన లేదని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకున్నది. ధైర్యం గా ఉండాలని, పరిహారం అందేలా ప్రభుత్వంతో పోరాడుతామని భరోసా కల్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

