మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆల్మట్టి ఎత్తు పెంచితే.. మరో పోరాటం తప్పదుఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మా రుతుందన్నారు. సాగు నీళ్లు కాదు, తాగడానికి నీళ్లు కూడా ఉండవనీ.. అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
కర్ణాటక జల దోపిడీని అడ్డుకుంటామని, కర్ణాటక దోపిడీతో పాలమూరు ఎడారిగా మారుతుందనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచితే .. కిందికి నీళ్లు వచ్చే పరిస్థితి లేదని పైన కర్ణాటకలో కట్టిన బ్యారేజీలు డ్యామ్ వల్ల.. పోతిరెడ్డిపాడు బొక్క పెట్టడం వల్ల కృ ష్ణానది నీటిని అక్రమంగా తీసుకుపోతున్నారన్నారు. ఎండాకాలంలో కృష్ణానది పూర్తిగా ఎండిపోయింది.. మొత్తంగా నీళ్లు రాకుండా అయిపోయింది. దీనికి కారణం కర్ణాటక జల దోపిడీయేనని మండిపడ్డారు.
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం కోసం దాదాపు లక్షా 50వేల ఎకరాల భూమిని సేకరించి.. ఇప్పుడున్న ఎత్తుకంటే 100 టీఎంసీల నీళ్లు అదనంగా నిలిపే విధంగా దీన్ని నిర్మిస్తున్నారు.ఇది గనక పూర్తయితే చుక్క నీరు కూడా కిందికి వచ్చే పరిస్థితి లేదన్నా రు. కృష్ణవాటర్ బోర్డు తేల్చకముందే.. ట్రిబ్యునల్ తీర్పు రాకముందే.. ఎగువన ఉన్న రాష్ర్టాలు ఎక్కడికక్కడ నీళ్లు తీసుకుపోతే మహబూబ్‌నగర్‌లో మనం బతకాల వద్దా అనే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తుపై పార్టీలకు అతీతంగా అం దరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే కేంద్రంతో.. ఢిల్లీకి పోయి ఆందోళనకు సిద్ధం కావాలి.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడుదాం అని చెప్పారు.
ల్మట్టి ఎత్తు పెంపుపై ప్రభుత్వంలో ఉన్న వాళ్లు కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే తీర్మానాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాల్సిందేనని తేల్చిచెప్పారు. కాం గ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయింది. రెండేళ్లలో అభివృద్ధి జరగలేదని.. గత పదేండ్లు అని మాట్లాడటం అలవాటు అయిందని.. కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు రాష్ర్టాన్ని పాలించిన విషయం గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. యాబై ఏండ్లు అధికారంలో ఉన్నా కనీస మౌలిక వసతుల కల్పించ లేకపోయింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. మంచినీళ్లు కూడా ఇవ్వలేక పోయిందని..
మిషన్ భగీరథ మెయింటెనెన్స్ చేయడం చేత కా వడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీ మహబూబ్‌నగర్ జిల్లాకు వలసల జిల్లా అని పేరు తెచ్చా రు ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. జిల్లా ప్రాజెక్టులు అంటేనే పెండింగ్ ప్రాజెక్టులు అనేలాగా చేశా రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చినం లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించామన్నారు. పాలమూరు ప్రాజెక్టు 90శాతం పనులు పూర్తి అయితే రెండేళ్లుగా పనులు పెండింగ్ పెట్టారని ఆరోపించారు.
పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసే పరిస్థితి లేదు..
పాలమూరు ఎత్తిపోతల పథకం తొందరగా పూర్తి చేయాలని మాజీ మంత్రులు డిమాండ్ చేశారు. మా హయాంలో ఇరిగేషన్ కెనాల్లకు టెండర్ కూడా పిలిచాం… వాటిని పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వానికి టైం ఇచ్చినం.. పాలమూరు ప్రాజెక్టును మొత్తం పడావు పెట్టేలా ఉన్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఉద్యమం చేపట్టాలని నిర్ణయించామని ప్రభుత్వానికి టైం ఇచ్చి పండుగల తరువాత కార్యచరణ ప్రారంభిస్తామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఒక పంప్ స్టార్ట్ చేసినం.. కాల్వ పూర్తి చేసి ఉంటే కరివెన వరకు నీళ్లు తీసుకొని రావచ్చు.. ఇది చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరుకు అన్యాయం చేసిందన్నారు. రైతులకు యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే పంట నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం కేవలం 16 నెలలే ఉన్నాడు. ఆరు నెలలు ఢిల్లీలో, ఇతర రాష్ర్టాల్లో ఉన్నాడనీ ధ్వజమెత్తారు. 42% బీసీలకు జీవోలు ఇచ్చి కాదు.. ఏకంగా ఉద్యోగ ఉపాధిలో కూడా రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. స్థానిక ఎన్నికలు జరిగితే ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధం అయ్యారని అందుకే కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
2014 కంటే ముందు ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ సాగు పరిస్థితి ఎంత ఉందో ఆ తర్వాత ఎంత ఉందో ప్రత్యక్షంగా కండ్ల ముందు కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శలు మాని సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై ఉందన్నారు. పదేండ్లు యూరియా కొరత లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది.. ఎక్కడ తప్పు జరిగింది సరిదిద్దు కోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విద్యుత్ కోతలు ఎందుకు ఉన్నాయి. మేము గతంలో నిరంతరాయంగా ఎందుకు ఇచ్చాం.. ఇప్పుడు ఎందుకు పోతుంది? దానిపై కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
తాగడానికి కూడా నీళ్లు కరువ య్యే పరిస్థితి మళ్లీ దాపురించింది.. పట్టణాల్లో గ్రా మాల్లో నాలుగు రోజులకు ఒకసారి మళ్లీ నీళ్లు వస్తున్నాయి ఈ పరిస్థితి ఎందుకు ఉందని ప్రశ్నించారు. తాగునీటిని క్లోరినేషన్ చేయకుండానే వచ్చింది వచ్చినట్లుగానే నల్లాల్లోకి విడుస్తున్నారు..దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.. అవసరమైతే దీనిపై పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టాలని సూచించారు. ప్రతిపక్షాలు మాట్లాడుతునప్పుడు వాస్తవాలు కూడా గమనించి సరిదిద్దుకోవాలి.. కానీ ఎదురుదాడికి దిగుతున్నారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.ఈ పద్ధతిని మార్చుకోవాలని హితవుపలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సలీం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గంజి ఎంకన్న, శివరాజ్ , శ్రీనివాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.