ఉస్మానియా యూనివర్సిటీ : తార్నాక లో నూతనంగా నెలకొల్పిన మై హెల్త్ ఆసుపత్రిని (My Health Hospital ) మాజీ మంత్రి హరీష్ రావు ( Harish Rao ) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి రెండో బ్రాంచ్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పేద ప్రజలకు తక్కువ ధరతో నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని యాజమాన్యానికి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, టిటియుసి రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.