పెనుబల్లి, జూన్ 27 : ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు వంగ సుబ్బారావు (90) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజరలోని ఆయన స్వగృహంలో శనివారం మృతిచెందారు. ఉమ్మడి ఏపీ సీఎం జలగం వెంగళరావు అను చరుడిగా పేరు తెచ్చుకున్న సుబ్బారావు.. 1972 నుంచి 1978 వరకు ఇల్లెందు ఎమ్మెల్యేగా పని చేశారు.
శాసనసభలో కమ్యూనిస్టులతో కలిసి ప్రజాసమస్యల పరిష్కారం కోసం ముందుకుసాగారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.