నీలగిరి, సెప్టెంబర్ 17: భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ వక్రీకరిస్తున్నదని సీపీఎం మాజీ పొలిట్‌బ్యూరో సభ్యు రాలు బృందాకారత్ విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట వా రోత్సవాల ముగింపు సభ బుధవారం నల్లగొండలోని సుభాష్ విగ్రహం వద్ద జరిగింది. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ సాయుధ పోరాటంలోగాని పాల్గొనని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఈతరం యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్, బీజేపీకి అర్హతే లేదు : రాఘవులు
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సెప్టెంబర్ 17న ఉత్సవాలు జరిపే అర్హత కాంగ్రెస్, బీ జేపీకి లేనేలేదని సీపీఎం పొలి ట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టంచేశారు. సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సా యుధ రైతాంగ పోరాటంలో కమ్యూ నిస్టులదే కీలకపాత్ర అన్నారు.