ఎల్బీనగర్, జనవరి 20: మహమ్మారి మహానగరంలో మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా బాధితులకు చేయూతను ఇచ్చేందుకు దిల్సుఖ్నగర్లోని సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ముందుకు వచ్చింది. సేవా కార్యక్రమాలు చేపట్టడంలో నిత్యం ముందుండే సాయి సంస్థాన్ ట్రస్టు వారు గత కరోనా సమయంలో బాధితులకు అన్న ప్రసాదాన్ని అందించినట్లుగానే, తాజాగా మూడు పూటలా అందించేందుకు గురువారం నుంచి శ్రీకారం చుట్టారు. సంస్థాన్ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో క్వారంటైన్లో ఉన్న వారికి సిబ్బంది స్వయంగా వెళ్లి అల్ఫాహారంతో పాటు అన్న ప్రసాదాన్ని అందిస్తారని ఆలయ కమిటీ వారు తెలిపారు. అలా కాకుండా స్వయంగా వచ్చి అన్న ప్రసాదాన్ని తీసుకుని వెళ్లే వారికి కూడా సంస్థాన్ పీఆర్ఓ కార్యాలయం వద్ద ఆహారాన్ని అందిస్తామని వారు తెలిపారు. ఇతర వివరాలకు సాయి సంస్థాన్ పీఆర్ఓ కార్యాలయంలో సంప్రదించాలని వారు కోరారు. మరిన్ని వివరాలకు దిల్సుఖ్నగర్, సాయిబాబా సంస్థాన్ ట్రస్టు, ఫోన్ నంబర్లు 040-2406 6566, 83309 66566లలో సంప్రదించవచ్చునని వారు తెలిపారు.