న్యూఢిల్లీ, నవంబర్ 8: ఫుడ్ డెలివరీ సేవల సంస్థ స్విగ్గీ ఐపీవోకి రిటైల్ పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. తొలి రెండు రోజుల్లో మిశ్రమంగా ఉన్న ఈ వాటా విక్రయానికి చివరి రోజు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. దీంతో కంపెనీ జారీ చేసిన షేర్లకు నాలుగు రెట్ల అధిక బిడ్డింగ్లు వచ్చాయని పేర్కొంది. రూ.11 వేల కోట్ల వాటా విక్రయానికి సంబంధించి సంస్థ జారీ చేసిన 16,01,09,703 షేర్లకుగాను 57,53,07,536 షేర్ల బిడ్డింగ్లు వచ్చాయి. షేరు ధరల శ్రేణిని రూ.371-390 స్థాయిలో నిర్ణయించింది.
20న మార్కెట్లకు సెలవు
న్యూఢిల్లీ, నవంబర్ 8: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ నెల 20న స్టాక్ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి. బీఎస్ఈతోపాటు ఎన్ఎస్ఈ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ విభాగం కూడా మూసివేసివుంచనున్నారు. ప్రస్తుత నెలలో స్టాక్ మార్కెట్లు సెలవు పాటించడం ఇది మూడోసారి. నవంబర్ 1న దీపావళి సందర్భంగా మూసివేసివుంచగా, గురు నానక్ జయంతి సందర్భంగా ఈ నెల 15న సెలవు పాటించనున్నాయి.