మహదేవపూర్(కాళేశ్వరం), జూలై 28 : మేడిగడ్డ బరాజ్‌కు వరద భారీగా పెరిగింది. ఆదివారం 3,41,350 క్యూసెక్కుల ప్రవాహం రాగా, సోమవారం 5,25,930 క్యూసెక్కులకు చేరింది. బరాజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుత నీటి ప్రవాహం బరాజ్ రివర్బెడ్ నుంచి సముద్ర మట్టానికి 4.30 మీటర్ల ఎత్తులో ఉందని భారీ నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. కాళేశ్వరంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. నదీ వ్రవాహం పుష్కర ఘాట్ మెట్లను తాకుతున్నది. ప్రస్తుత నీటిమట్టం సుమారు 8.5 మీటర్ల ఎత్తులో ఉందని సీడబ్ల్యూసీ అధికారులు వెల్లడించారు.