Flight crash : కజకిస్థాన్ (Kajakisthan) లో ఘోరం జరిగింది. ఇవాళ ఉదయం 72 మంది ప్రయాణికులతో వెళ్తూ ఓ విమానం కుప్పకూలింది. కజకిస్థాన్‌లోని అక్టౌ (Aktau) నగరలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్ (Azerbaijan Airlines) కు చెందిన విమానం అజర్‌బైజాన్‌లోని బాకు (Baku) నుంచి రష్యాలోని గ్రోజ్నీ (Grozny) కి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.
గ్రోజ్నీలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాన్ని అత్యవసరంగా కజకిస్థాన్‌లోని అక్టౌ విమానాశ్రయంలో దించేందుకు పైలట్ ప్రయత్నించారు. అందుకోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కూడా కోరారు. ఇంతలో విమానం ఆక్టౌ విమానాశ్రయం పైకి వచ్చి చక్కెర్లు కొడుతూ కుప్పకూలింది. ప్రమాదం జరగగానే కజకిస్థాన్‌కు చెందిన రెస్క్యూ టీమ్స్ ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
రెస్క్యూ సిబ్బంది విమానం నుంచి ఆరుగురు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. మిగతావారి పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియాల్సి ఉంది.
Kazakh media reports that the plane flying from Baku to Grozny crashed at Aktau airport.
Before that, the plane made several circles over the airport. pic.twitter.com/rbcxjejFxR
— Портал Blog-Club.org (@blogclub_org) December 25, 2024