(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : పంజాబ్ జైళ్లలోని ఖైదీలు మత్తులో తూగుతున్నారు. గంజాయి, డ్రగ్స్‌ను ఎవరో ఒకరు సరఫరా చేసి ఉంటారులే.. అనుకొంటున్నారా? కానేకాదు. జైలు గోడలపై పాకే బల్లులే దీనికి కారణం. వివరంగా చెప్పాలంటే.. కారాగారంలో ఉన్న ఖైదీలు గోడల మీద ఉన్న బల్లులను పట్టుకొని చంపి సూర్యకాంతిలో ఎండబెడుతున్నారట.
అలా ఎండిపోయిన బల్లి శరీరాన్ని పౌడర్‌గా చేసి.. దాన్ని ఓ మాదకద్రవ్యంగా పీలుస్తూ తూగుతున్నారని తెలిసింది. ఉన్నతాధికారులు ఇద్దరుముగ్గురు ఖైదీల ప్రవర్తనను గమనించి అసలు విషయం ఏమిటా? అని ఆరా తీస్తే, ఈ బల్లుల కహానీ బయటపడిందట. ఇది సాధ్యమేనా? అనేదానిపై వివరాలను సేకరిస్తున్నారు.