నేషనల్ ఇన్‌స్పైర్‌లో తెలంగాణ విద్యార్థుల సత్తా
ఇన్స్పైర్ - మనక్ జాతీయ ప్రదర్శనలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. ఈ నెల 12 నుంచి 14 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 780 ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు.
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఇన్స్పైర్ – మనక్ జాతీయ ప్రదర్శనలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. ఈ నెల 12 నుంచి 14 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 780 ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. కేంద్రం 62 మందిని విజేతలుగా ఎంపిక చేసింది.
విజేతల్లో కర్ణాటక నుంచి 9, మహారాష్ట్ర నుంచి ఏడుగురు, తెలంగాణకు చెందినవారు ఐదుగురు ఉన్నారు. వీరు జపాన్ దేశంలో నిర్వహించే సకురా సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. విజేతలను సీఎం రేవంత్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ అభినందించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

