నీటి గోస.. లోప్రెషర్.. కలుషిత నీటితో జనం అవస్థలు
నాగోలు పాత గ్రామంలో పది రోజులుగా నీటి కాలుష్యంతో నీటి సరఫరాలో అంతరాయంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మురుగునీరు కలిసి వస్తుండటంతో నీటిని తాగేందుకు వీలు లేకుండా పోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. పది రోజుల్లో ఐదు రోజుల పాటు వాటర్ సరఫరా నిలిపివేయగా బుధవారం సరఫరా చేసిన నీరు కూడా చెత్త, చెదారంతో కలిపి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి కోసం ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. సరఫరాలో లో ప్రెషర్ సమస్యలకు తోడు పలు ప్రాంతాల్లో లీకేజీలు, నీటి కాలుష్యం వంటి వాటితో అవస్థలుపడుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్ సముదాయాల్లో నీటికి కటకటగా మారింది. సరఫరా అవుతున్న నీరు అందరికీ సరిపోవడం లేదని, పలు ప్రాంతాల్లో లో ప్రెషర్‌తో సరఫరా అవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో ఉపయోగానికి కూడా పనికిరావడం లేదు. మరోవైపు లీకేజీలతో కూడా నీరు వృథా అవుతోంది. ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా తీవ్ర మంచినీటి ఎద్దడి ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేసవిని తలపించేలా మంచినీటి ట్యాంకర్ల క్యూలు కొనసాగుతున్నాయి.
– ఎల్బీనగర్, అక్టోబర్ 14
అంతరాయంతో అవస్థలు
నాగోలు పాత గ్రామంలో పది రోజులుగా నీటి కాలుష్యంతో నీటి సరఫరాలో అంతరాయంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మురుగునీరు కలిసి వస్తుండటంతో నీటిని తాగేందుకు వీలు లేకుండా పోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. పది రోజుల్లో ఐదు రోజుల పాటు వాటర్ సరఫరా నిలిపివేయగా బుధవారం సరఫరా చేసిన నీరు కూడా చెత్త, చెదారంతో కలిపి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. నాగోలు ఎస్సీ, బస్తీతో పాటుగా పరిసర ప్రాంతాల్లో నాలుగు చోట్ల నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు అధికారులు పైప్‌లైన్ లీకేజీలను పసిగట్టేందుకు తవ్వకాలు జరిపినా పూర్తిస్థాయిలో నీటి కాలుష్యం ఆగిపోలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగోలు చౌరస్తా నుంచి మోహన్‌నగర్ వెళ్లే దారిలో పూల దుకాణం వద్ద ప్రధాన రోడ్డు మద్యలో వాటర్‌లైన్ లీకేజీ జరిగి వారం రోజులుగా నీరు వృథా అవుతోంది. ఈ ప్రాంతంలో లీకేజీలను సంబంధిత జలమండలి అధికారులు గుర్తించినప్పటికీ మరమ్మతుల విషయంలో తాత్సారం చేయడంతో నిత్యం ఈ ప్రాంతంలో రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారింది. ఇలా పలు ప్రాంతాల్లో వాటర్లైన్ల లీకేజీల మూలంగా కూడా తాగునీరు వృథాగా పోయి ప్రజలకు సరిపడినంత నీరు అందడం లేదు.
ఎల్బీనగర్, అక్టోబర్ 14: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వేసవి మాదిరి నీటి డిమాండ్ పెరుగుతుండటంతో మంచినీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా అపార్ట్మెంట్ వాసులతో పాటు బస్తీలు, మురికివాడల్లో ప్రజలు నీటి కోసం ట్యాంకర్లు కావాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా మంచినీటి సరఫరా కోసం ట్యాంకర్ల కోసం వస్తుండటంతో జలమండలి ట్యాంకర్ సరఫరా కేంద్రాల్లో క్యూలు కన్పిస్తున్నాయి. ఏటా వేసవి సమయంలోనే ఈ పరిస్థితి కనిపించేది. అయితే ప్రస్తుతం ట్యాంకర్లు సరఫరా చేసే ఎన్టీఆర్నగర్, ఆటోనగర్ ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది.
సింగరేణికాలనీలో దాహం..దాహం
సైదాబాద్: తాగునీరు లేక ప్రజలు అవస్థలుపడుతున్నారు. జలమండలి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే తాగునీరు సక్రమంగా లేకపోవడంతో గొంతులు ఎండిపోతున్నాయి. రోజు విడిచి రోజు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటి కోసం గుడిసెవాసులు పడిగాపులు కాసుస్తున్నారు. సరస్వతీనగర్ డివిజన్లోని సింగరేణి కాలనీ గుడిసెవాసులు తాగునీటి సరఫరా లేకపోవటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం రాకముందే తాగు నీటి కోసం గుడిసెవాసుల గొంతులు ఎండిపోతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైశాలినగర్ రిజర్వాయర్ నుంచి రోజు విడిచి రావాల్సిన ట్యాంకర్ల సరఫరా సక్రమంగా లేక పోవడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గుడిసెవాసులకు..ట్యాంకర్లే దిక్కు
వైశాలినగర్ రిజర్వాయర్ ఫిల్లింగ్ కేంద్రం నుంచి ట్యాంర్ల ద్వారా సరఫరా చేసే తాగునీటిపై సింగరేణికాలనీ, రోషన్‌దౌలా గుడిసెవాసులు ఆధారపడి జీవిస్తున్నారు. స్థానికంగా 15వేల కుటుంబాలకు చెందిన ప్రజలు గుడిసెల్లో జీవిస్తున్న వారందరికీ ట్యాంకర్ల నీళ్లే దిక్కు. ట్యాంకర్ల బస్తీకి రాకుంటే బిందెలను తీసుకొని తాగునీటి కోసం కాలనీలకు పరుగులు తీయాల్సిందే. తమ గుడిసెల వద్ద డ్రమ్ములను పెట్టుకొని తాగునీటి కోసం అనేక ఏండ్లుగా వారు పడుతున్న బాధలు వర్ణాతీతం. గుడిసెలకు రావాల్సిన ట్యాంకర్లు రాకపోవటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైశాలినగర్ రిజర్వాయర్ వాటర్ ఫిల్లింగ్ కేంద్రం నుంచి ట్యాంకర్లను జలమండలి అధికారులు సక్రమంగా సరఫరా చేయకపోవటంతో ఇబ్బదులు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే తాగు సరిపోవటంలేదని, ట్యాంకర్ల సంఖ్య పెంచి తమ తాగునీటి కష్టాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
అవస్థలు పడుతున్నాం
నాగోలు ఎస్సీ బస్తీలో పది రోజులుగా నీటి కాలుష్యంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. ఐదు రోజులు అసలు నీరే సరఫరా కాలేదు. నీటి ఎద్దడితో బస్తీవాసులం ఇబ్బందులు పడుతున్నారు. నీటి కాలుష్యాన్ని కారణాలు గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా.. అవి పూర్తిస్థాయిలో ఫలించడం లేదు. ఎండాకాలం మాదిరిగా నీటి ఇబ్బందులు ఉన్నాయి.
– కొమ్ము శ్రీశైలం ( నాగోలు )
చెత్త, చెదారంతో నీరు సరఫరా
నాగోలులో మంచినీరు చెత్తాచెదారంతో సరఫరా అవుతోంది. దీంతో ప్రజలు నీటి కోసం ఇతర మార్గాలు వెతుక్కుంటున్నారు. మంచినీరు సరఫరా విషయంలో అధికారులు తక్షణం స్పందించాలి. ప్రజల అవస్థలను గమనించాలి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ నీటి కాలుష్యం మరింత ఇబ్బందిగా మారుతోంది. నీటి కోసం వాటర్ ప్లాంట్ల చుట్టూ తిరుగుతున్నాం.
-ప్రదీప్‌కుమార్ ( నాగోలు)
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

