లండన్: కొవిడ్ నిర్మూలనకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గోలి మందు అందుబాటులోకి వచ్చింది. లాజెవ్రీయో(మోల్నుపిరావిర్)ను కొవిడ్ చికిత్సలో వినియోగించేందుకు బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతినిచ్చింది. వైరస్ సోకిన వారు ఈ గోలీలను రోజుకు రెండుసార్లు వేసుకొంటే మంచి ఫలితం ఉంటుందని పేర్కొన్నది. వ్యాధి ముదరకుండా చేస్తుందని తెలిపింది. వీటిని త్వరలోనే దేశవ్యాప్తంగా మార్కెట్లోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. సాధారణంగా మోల్నుపిరావిర్‌ను ఫ్లూ జ్వరానికి వాడతారు. మరోవైపు, తాము తయారు చేసిన యాంటివైరల్ మాత్ర కొవిడ్ వ్యాధి ముదరకుండా 90%, మరణాల నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందని ఫైజర్ శుక్రవారం ప్రకటించింది.