ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. హాస్య నటుడు సునీల్, ‘బిగ్‌బాస్’ ఫేమ్ కౌశల్, బెనర్జీలు ముఖ్యతారలు. ఝూన్సీ కూనం సమర్పణలో రవికనగాల, రామ్ తుమ్మలపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. రాఘవేంద్రరావు లాంటి గొప్ప దర్శకుడు చేతుల మీదుగా ఫస్ట్‌లుక్ విడుదల కావడం, తమ చిత్రం సాధించబోయే ఘనవిజయానికి శుభసూచకమని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం : అమర్.