హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ‘సరళీకృత ప్రొవిజనల్ ఎన్వోసీలు-నూతన సాంకేతికతల స్వీకరణ’ అనే అంశం పై రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు మం గళవారం వర్‌షాప్ నిర్వహించారు. అగ్నిమాపక శాఖ నోఆబ్జెక్షన్ సర్టిఫికెట్ల(ఎన్వోసీ) జారీ ప్రక్రియలో సాంకేతిక ఆధారిత, పారదర్శక, సమర్థ విధానాలను ప్రోత్సహించడ మే ఈ వర్‌షాప్ లక్ష్యమని ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ తెలిపారు. క్రెడాయ్, నరెడో, ఎఫ్ఎస్ఏఐ ప్రతినిధులు, అగ్నిమాపక భద్ర త, నిర్మాణ రంగాలతోపాటు అనుబంధ రంగాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖులు అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రొవిజనల్ ఫైర్ ఎన్వోసీ ప్రక్రియ, నూతన సాంకేతికతల స్వీకరణపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. అనుమతుల ప్రక్రియను సరళీకరించడం, సమర్థంగా తీర్చిదిద్దడంతోపాటు ఫైర్ సర్వీసెస్ శాఖ, డెవలపర్లు, కన్సల్టెంట్లు, ఫైర్ సేఫ్టీ నిపుణుల, సమన్వయాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు.