సీఎం రేవంత్‌ది ల్యాండ్ బ్రోకరింగ్
సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ల్యాండ్ బ్రోకరింగ్కు పాల్పడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మారిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ఆ బ్రోకరింగ్ను బంద్ చేయాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ల్యాండ్ బ్రోకరింగ్కు పాల్పడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మారిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ఆ బ్రోకరింగ్ను బంద్ చేయాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మల్కాజిగిరి పరిధిలో 22 వేల ఎకరాలను 22-ఏ నిషేధిత జాబితాలో పెట్టారని తెలిపారు. పేదల వ్యవసాయ భూములు, ఇండ్లనూ నిషేధిత జాబితాలో పెట్టడం దారుణమని పేర్కొన్నారు. ప్రైవేట్ భూములను ప్రభుత్వ భూములుగా చిత్రీకరిస్తూ దోచుకోవాలని కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన భూభారతి.. రైతాంగాన్ని అగాధంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం లేఅవుట్లు చేసి విక్రయించిన భూములనూ 22ఏలో చేర్చడమేంది? అని మండిపడ్డారు. ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసిన భూములకు హక్కులు కల్పిస్తూ.. ప్రభుత్వ భూముల్లో తరతరాలుగా సాగులో ఉంటున్న వారి భూములనూ గుంజుకుంటూ సీఎం రేవంత్ భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదల భూములను గుంజుకోవడం ఆపి, పరిపాలనపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ భూదందాపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఐలు నల్లగొండ 12వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి’
QS Rankings | క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్- 2027.. 76 స్థానాలు మెరుగుపరచుకున్న ఐఐటీ హైదరాబాద్
The Breaking News | డిసెంబర్ 11న ‘ది బ్రేకింగ్ న్యూస్’ రిలీజ్.. ట్రైలర్‌తో ఆసక్తి పెంచిన మురళీ మోహన్, అనన్య నాగళ్ల
Nirmala Sitaraman | డబ్బులు లేకపోవడం ఒక్కటే పేదరికం కాదు.. కేంద్ర ఆర్థికమంత్రి కీలక వ్యాఖ్యలు..!
YSRCP complaints | పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలపై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

