న్యూఢిల్లీ, నవంబర్ 1: రూ.15 వేల కోట్ల విలువైన ‘బైక్ బోట్’ కుంభకోణంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బైక్ బోట్ అనేది యూపీ కేంద్రంగా వెలసిన సంస్థ. సంజయ్ భాటి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా మరో 14 మందితో కలిసి ఏర్పాటుచేశారు. బైక్ ట్యాక్సీలు ఇస్తామని, వాటి ద్వారా ఆదాయం లభించేలా చూస్తామని నమ్మబలికి 2 లక్షల మంది నుంచి రూ.62,100 చొప్పున వసూలు చేసి బోర్డు తిప్పేశారు.