Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
Koppula Eshwar | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అవగాహనా రాహిత్యంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
జగిత్యాల / ధర్మపురి : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అవగాహనారాహిత్యంతో రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Koppula Eshwar ) అన్నారు. కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం ( Financial assistance) విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామంలో సాగునీరు అందక ఎండిపోతున్న వరి, పత్తి పొలాలను శనివారం పరిశీలించారు. పంటలు ఎండిపోయి తీవ్ర ఆందోళనలో ఉన్న మండల లింగయ్య, మండల భీమయ్య, చంద్రయ్య తదితర రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. రైతులు పెట్టుబడులు పెట్టినా చేతికి వచ్చే సమయంలో నీరు అందక పంటలు వృథా అవుతున్నాయని, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని వాపోయారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ సహకారంతో రూ.400 కోట్ల వ్యయంతో ఆర్.ఎఫ్.ఎల్ నుంచి ముత్తూరు వరకు 14 లిఫ్ట్‌లను ఏర్పాటు చేశామని, అందులో దొంతాపూర్ లిఫ్ట్ ఒకటి అని తెలిపారు. 6 నెలలుగా దొంతాపూర్ లిఫ్ట్‌లో 2-3 మోటార్లు మరమ్మతుకు గురైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గోదావరిలో నీరు ఉన్నప్పటికీ కన్నెపల్లి నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎండిపోయిన పంటలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి అయ్యోరి రాజేష్, సంగి శేఖర్, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

