ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బియ్యాన్ని అప్పగించకుండా ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లులో సివిల్ సప్లయ్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల పరిధిలోని...
– 3,919 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం స్వాహా?
– అనంతారం ఎక్స్ రోడ్ సమీపంలోని మహదేవ్ రైస్ ఇండస్ట్రీస్‌లో సివిల్ సప్లయ్ అధికారుల తనిఖీలు
– ఇద్దరు యజమానులపై కేసు నమోదు
పెన్‌పహాడ్, నవంబర్ 07 : ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బియ్యాన్ని అప్పగించకుండా ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లులో సివిల్ సప్లయ్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల పరిధిలోని అనంతారం ఎక్స్‌రోడ్డు సమీపంలో గల మహదేవ్ రైస్ ఇండస్ట్రీస్ మిల్లులో చోటుచేసుకుంది.
సుమారు రూ.12 కోట్ల విలువైన ధాన్యం బకాయిలు?
అధికారుల వివరాల ప్రకారం సదరు రైస్ మిల్లుకు కేటాయించిన ధాన్యానికి సంబంధించి ప్రభుత్వానికి సుమారు 3,919.686 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం తిరిగి అప్పగించాల్సి ఉండగా.. దానిని ప్రభుత్వానికి అందించకుండా మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ధాన్యం విలువ సుమారు రూ.12 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఇద్దరు మిల్లు యజమానులపై కేసు
ఈ వ్యవహారంపై సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ శ్రీధర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మిల్లు యజమానులైన సూర్యాపేటకు చెందిన కె.నాగయ్య, కుమారుడు కె.శివ సంకీర్త్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎస్ఐ బాలు నాయక్ ఆధ్వర్యంలో దర్యాప్తు
ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ బాలు నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యం అప్పగింతలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ధాన్యం లెక్కలు, మిల్లుకు కేటాయించిన ధాన్యం, తిరిగి అప్పగించాల్సిన బియ్యం వివరాలను డీఎస్పీ ఆధ్వర్యంలో పరిశీలించాల్సి ఉంది. ప్రభుత్వానికి చెందాల్సిన కోట్లాది రూపాయల విలువైన ధాన్యం వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

